రోజుకో ప్రశ్న (Compilation – #week 1)

Hi everyone

ప్రతివారం మనం గూగుల్ లో సైన్స్ కి సంబంధించిన, ఇండియాకి సంబంధించి వచ్చే ప్రశ్నలకి సరైన answers తెలుసుకోడానికి ఇక్కడ try చేస్తాం. ఈ వారం అందరూ వెతికిన ప్రశ్నలలో ఎక్కువశాతం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కరోనా గురించే ఉన్నాయి. సరే ఇక టైం వేస్ట్ చేయకుండా, ఈ వారం ప్రశ్నల ద్వారా కొత్త విషయాలు ఏం నేర్చుకున్నామో తెలుసుకుందాం.

వ్యాప్తి, అంటువ్యాధి ఇంకా మహమ్మారి మధ్య తేడాలు ఏంటి?

Ok, ఉదాహరణకి, కరోనా వైరస్ వుహాన్ వరకే పరిమితమైనప్పుడు దాన్ని ఆ ప్రాంతంలోనే “వ్యాప్తి” చెందినది అంటాం. అది చైనా మొత్తం వ్యాప్తి చెందినప్పుడు అంటువ్యాధిగా(epidemic) మారింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది కాబట్టి మహమ్మారిగా(pandemic) మారింది. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి ఒక ప్రాంతంలో సడెన్ గా వ్యాప్తి పెరిగితే దాన్ని అంటువ్యాధి అంటారు. అదే అంటువ్యాధి చాలా దేశాలకి, ఖండాలకి పాకిపోతే దాన్ని మహమ్మారి అంటారు.

Photo by slon_dot_pics on Pexels.com

 Next ప్రశ్న థర్మల్ స్క్రీనింగ్ అంటే ఏమిటి?

ఎయిర్ పోర్టుల్లో, ఓడరేవుల్లో థర్మల్ స్కానర్లను పెద్ద ఎత్తున ప్రయాణికుల స్క్రీనింగ్ పరీక్ష చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి వచ్చే ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతని ముందే పసిగడతాయి.  దీనివలన సాధారణం కన్నా వేరుగా ఉష్ణోగ్రతలు ఉన్న ప్రయాణికులని గుర్తుపట్టి, విడిగా మరింత సమాచారం తెలుసుకోటానికి ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అపాయకరమైన వ్యాధులు వ్యాపిస్తున్న సమయంలో దేశంలోకి బయటనుండి వ్యాప్తిని అరికట్టడానికి ఒక రక్షణ వలయంలాగా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. థర్మల్ ఇమేజి పరికరం కూడా మన కంటిలాగానే పనిచేస్తుంది. కాకపోతే కనబడే visible light, పరావర్తనం చెందే కాంతిని గుర్తించటమేకాక,ఇన్ ఫ్రారెడ్ కాంతిని, శరీరం నుండి విడుదలయ్యే వేడిని కూడా గుర్తిస్తుంది.

Photo by cottonbro on Pexels.com

అలాగే కోవిడ్ – 19కి వ్యాక్సిన్ కనుక్కుంటే అది కేవలం ఒక్క దేశానికే పరిమితం కాకూడదనే చర్చ కూడా నడుస్తోంది. ప్రపంచం మొత్తానికి దాని అవసరం ఉంది. ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ అన్నట్టు “సైన్స్ కి సరిహద్దులు, దేశాలు లేవు ఎందుకంటే జ్ఞానం అనేది మానవాళి మొత్తానికి సంబంధించినది. అలానే జరగాలని ఆశిద్దాం.

ఒకరోజు మరొక interesting ప్రశ్న వచ్చింది – కరోనా వైరస్ కి కోవిడ్ 19 అని పేరెందుకు పెట్టారు?

వైరస్ పేర్లని ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ (ICTV) పెడుతుంది. అలాగే వ్యాధుల పేర్లని అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పెడుతుంది. ICTV ఈ కొత్త వైరస్ కి సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం కరోనా వైరస్ 2 ( SARS CoV2) అని పేరుపెట్టింది. WHO ఈ కొత్త వ్యాధి పేరుని కోవిడ్ – 19 గా నిర్ణయించింది.

ఈ పేరెందుకు పెట్టారంటే ఈ కొత్త వైరస్, 2003 లో వచ్చిన సార్స్ వ్యాధికి మూలం అయిన కరోనా వైరస్ కి జన్యుపరంగా సంబంధించినది. జన్యుపరంగా సంబంధం, పోలికలు వున్నా ఈ రెండు వైరస్ లు వేర్వేరు.

అలా కరోనా వైరస్ డిసీజ్ – 19 ని కోవిడ్ – 19 అని పిలుస్తున్నారు. 19వ సంఖ్య ఈ వ్యాధి ప్రారంభమైన సంవత్సరాన్ని సూచిస్తుంది.

Photo by cottonbro on Pexels.com

తర్వాత ప్రశ్న యాంజియోగ్రఫీ టాపిక్ గురించి. అసలు యాంజియోగ్రఫీ అంటే ఏమిటి?

శరీరంలో రక్తనాళాలని పరిశీలించటానికి చేసే ఒకరకమైన ఎక్స్ – రే పరీక్షని యాంజియోగ్రఫీ అంటారు. ఈ వచ్చే ఎక్స్ – రే చిత్రాలను యాంజియోగ్రామ్ అంటారు. ఈ రకమైన పరీక్షని రక్తనాళాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో గమనించటానికి , రక్తం ఎలా ప్రసరిస్తోందో పరీక్షించటానికి చేస్తారు. ఈ పరీక్ష మెదడు, గుండె, కిడ్నీలు, కాళ్ల వంటి అవయవాల్లో ఉన్న రక్తనాళాలకి వచ్చే అనేక సమస్యలని గుర్తించటంలో సాయపడుతుంది.

యాంజియోగ్రఫీ పరీక్షలో కూడా చాలా రకాలు ఉంటాయి. గుండెకి చేసేదాన్ని కరోనరీ యాంజియోగ్రఫీ అంటారు, మెదడుకి సెరెబ్రల్ యాంజియోగ్రఫీ, ఊపిరితిత్తులకి పల్మొనరీ యాంజియోగ్రఫీ, కిడ్నీలకి రీనల్ యాంజియోగ్రఫీ మొదలైనవి వివిధ రకాలుగా ఉంటాయి. ఈ ఎక్స్ రే రకం పద్ధతి బదులు స్కానింగ్ పద్దతిలో ఈ పరీక్ష చేస్తే అప్పుడు CT యాంజియోగ్రఫీ, MRI యాంజియోగ్రఫీ అంటారు.

సరే యాంజియోగ్రఫీకి యాంజియోప్లాస్టీ రెండూ వేర్వేరని మీకు తెలుసా?

గుండెజబ్బులు వచ్చే అవకాశాలని తెలుసుకోటం కోసం రక్తనాళాలని పరీక్షించడం యాంజియోగ్రఫీ. వచ్చిన గుండెజబ్బుకి చికిత్సలో భాగంగా మూసుకుపోయిన ధమనులని వెడల్పు చేయడాన్ని యాంజియోప్లాస్టీ అంటారు.

ఈ వారానికి ఆఖరి ప్రశ్న ఇంబిబిషన్ అనే ప్రక్రియ నిర్వచనం ఏమిటి?

ఇంబిబిషన్ ని తెలుగులో అంతఃశోషణం అంటారు. ఇది ఒక రకమైన విస్తరణ(Diffusion) కిందకే వస్తుంది. నీటిలో కరగని పదార్థాలు నీటిని తాత్కాలికంగా పీల్చుకుని ఉబ్బే ప్రక్రియ అని ఇంబిబిషన్ అంటారు. వర్షాకాలంలో తలుపులు నీటిని పీల్చుకుని టెంపరరీగా ఉబ్బటం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

So ఈ వారానికి ఇవే ప్రశ్నలు. See you next time.bye.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.