నా కథ, సొద..2018 లోకి..!

Happy New year…

ఎంత విచిత్రం కదా! కాలానికి కొత్త పాత ఏమీ ఉండదు..మనం కనుక్కున్న patterns రిపీట్ అయిన ప్రతీసారి ఒక సెలబ్రేషన్, పండగగా ఉత్సాహం. బర్త్ డే, డెత్ డే, యానివర్సరీలు, పండగలు, న్యూఇయర్ లు..

అది కూడా మంచిదేలే ..ఎప్పుడైనా బిగినింగ్స్ ఇచ్చిన ఉత్సాహం మరేదీ ఇవ్వదు. అందుకే ఈ రిపిటీషన్స్ అంటే అంత క్రేజ్ ఏమో! తిరిగి తిరిగి మళ్ళీ అవే రోజులు జరుపుకునేది కొత్తగా బ్రతికే అవకాశం మళ్ళీ సున్నా నుంచి మొదలుపెట్టవచ్చని గుర్తు చేసుకుంటూ, తాము ఇంత జీవితాన్ని,ఇంతమందిని సంపాయించుకున్నామని ఒక సెల్ఫ్ ఎస్యూరెన్స్ కావచ్చు. కుటుంబాలు, దగ్గరి వారు కలిసే పండగలు, పార్టీలు ఇంకా అందుకే బ్రతికున్నాయేమో!

కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే వారం రోజులైపోయింది. సూర్యుడి చుట్టూ మరో రివల్యూషన్ కి ప్రయాణం. ఎప్పటిలాగా ఈ సారి ఏ రిజల్యూషన్స్ తీసుకోలేదు. పాతవాటిని అన్నిటినీ ఒకసారి  మనస్సులో తిరగేసాను. కొన్ని సాధించాం, కొన్నిటిలో ప్రోగ్రెస్ ఉంటుంది. ఎక్కువ శాతం మళ్ళీ మళ్ళీ అదే చోట దెబ్బ తగిలి ఉంటుంది. ఈ సారి ఆ దెబ్బలు తగిలిన చోట నన్ను నేన్ను ఇంకా ప్రేమించుకుంటూ మరో రివల్యూషన్ లో ముందుకెళ్ళటం ముందుంది.

అఫ్ కోర్స్, జనవరి 1 కి ముందు రోజున ఏవైతే పనులు, ప్రయత్నాలున్నాయో అవి కూడా కొత్త సంవత్సరంలో అలానే నాతోపాటు ప్రయాణించాయి. అండర్ ఎంప్లాయ్మెంట్ ను ఎదుర్కోవటం, ఐడెంటిటిని మరింత అర్థం చేసుకోవటం,దానికి ఏ కొత్త రంగులు అద్దవచ్చో తెలుసుకోవడం, మరింత కష్టపడటం, ఈ సారి హిమాలయాల్లో కొత్త పర్వతాలను చూస్తూ అన్ని సీజన్స్ ను ప్రేమించటం నేర్చుకోవడం, ఫాలోవర్లు, రీడర్లు, హిట్’స్, ఇంగ్లీషు రాతలే ముఖ్యంగా కాకుండా, బ్లాగులో మనసుకి నచ్చింది రాస్తూ, ఎక్స్ ప్రెషన్ నేర్చుకోవడం, ఇన్నాళ్ళూ పరిగెత్తిన, దాక్కున్న,అలసిన మనసుకి నచ్చినవి చేస్తూ మళ్ళీ స్పందించటం తెలియచెప్పటం.. ఇవన్నీ క్రితం ఏడాది కూడా ఉన్నాయి. నేర్చుకున్న విషయం ఏంటంటే ఇవి జీవితాంతం ఉంటాయి. రూపాలు, భావాలు మారవచ్చేమో కానీ ప్రతి ఏడాది ఇవి కూడా మనతో పాటు పరిభ్రమిస్తాయి.

థర్మోడైనమిక్స్ లో ఎంట్రోపి అన్న పదానికి సరైన అర్థం జీవితమే అయి ఉంటుంది. Universe లో జరిగే అన్ని చర్యలు, పనులు శక్తిని ఎంత order లో పెట్టడానికి ప్రయత్నిస్తాయో, Entropy అంత మళ్ళీ disorder చేయటానికి ప్రయత్నిస్తుందని థర్మోడైనమిక్స్ సూత్రం. కాకపోతే ప్రతీ ఏడాది పరిభ్రమణంలో కొత్త సంవత్సరం రోజు తీసుకున్న రిజల్యూషన్స్ చివరికొచ్చేసరికి మనకి ఎంత దూరంగా వెళ్ళిపోతాయో, మనం వాటిని సాధ్యమైనంత ప్రయత్నిస్తూ వెనక్కి తీసుకురావడం,మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు ఒత్తిడి పడకుండా, మౌనంగా వెనక్కి తీసుకురావడం సైన్స్ కాదు మన జీవితంలో మరో సంవత్సరం కావచ్చు. అదే ఒక రిజల్యూషన్ కావచ్చు.

So into another year..Another set of experiences which are yet same somehow 🙂

ఈ వారంలో ఇంటర్నెట్ ఆపేసి అరగంటలో దాదాపు 3 కిలోమీటర్ల వరకూ నడవటం నేర్చుకున్నాను. శరీరాన్ని అందంగా ఉంచుకోవటం తప్పనిసరి కాకపోయినా ఆనందంగా ఉంచుకోవటం ముఖ్యమని తెలుసుకున్నాను. ప్రపంచంలో జరిగే విశేషాలను gist గా ఎలా assimilate చేసుకోవచ్చో వెతికాను. మళ్ళీ పర్వతాల దగ్గరకి ఒక పదిరోజులపాటు పారిపోవటానికి సరిపడే రెండు పెద్ద ప్రాజెక్టులు ఒప్పుకున్నాను. ఒక ఎన్నారై రైటర్ రాసిన మ్యాజికల్ రియలిజంకి చెందిన ద మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్ నవల మొదలుపెట్టాను. ఏడురోజులు పెన్సిల్ గీతలలో ఇన్స్ టాగ్రామ్ ను నాకు తెలిసిన రంగుల్లో జర్నల్ లాగా నింపుకొని భద్రపర్చుకోవచ్చని తెలుసుకున్నాను. ఈ రాతలతో పాటు గీతలను ఇక్కడ చూడవచ్చు – The Wayfarer stories

IMG_20180106_020334.jpg
Lesson to be followed this year..
IMG_20180105_221642.jpg
Embrace the glorious mess that you are! -Elizabeth Gilbert
IMG-20180104-WA0041.jpg
Find your fun…always.

అలా నేను చెప్పాలనుకున్నది వెతికే పింట్ రెస్ట్ ఉపయోగం తెలుసుకున్నాక, ఇంకా కొరుకుడుపడని లెక్కలు, మాస్ కమ్యూనికేషన్ మొదలుపెట్టాను. పోకర్ లో చిప్స్ అన్నీ ఓడిపోయినా స్టేక్స్ పెరిగినప్పుడు రిస్క్ తీసుకోవాలని నేర్చుకున్నాను, 78 వ ఏడులోకి అడుగుపెట్టిన అమ్మమ్మకి కుక్కర్లో వండిన కేకుపై స్ప్రింకిల్స్ చల్లడానికి ఇన్నాళ్ళూ వెళ్ళలేని ఈగో లోపల దాచుకుని విస్తరాకులలో అందరూ ఆనందంగా తిన్న రంగులను కూడా చూడవచ్చని తెలుసుకున్నాను.

మొదటిసారి అన్నాచెల్లెళ్ళలోని స్నేహితులతో కలిసి బర్గర్ తిన్నాను. జీవితంలో ఒకసారి నచ్చనిది లేదా మనకు దూరం అయినది జీవితాంతం అలానే ఉండాలనే నియమం లేదు. మళ్ళీ అది మన ముందుకి వచ్చినపుడు నవ్వుతూ దానితో కూడా స్నేహం చేయవచ్చని నాకు పాఠం చెప్తుంటే విన్నాను.

Haha ఇవన్నీ నిజంగానే కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ లో భాగాలు కావు. మనం చూడాలే కానీ ఒక్క వారంలో, ఒక్క రోజులో క్షణాలు బోలెడు !

మీ కొత్త సంవత్సరం వారం తిరిగేసరికి ఎలా గడుస్తోంది? కొత్తగానే ఉందా?

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.